మేఘాలయ కొలను శుభ్రం చేసిన విదేశీ పర్యాటకుడు

15248చూసినవారు
మేఘాలయలో సహజసిద్ధమైన కొలను మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోగా, పోర్చుగీసుకు చెందిన బ్రూనో అనే విదేశీ పర్యాటకుడు స్వచ్ఛందంగా కొలనులోకి దిగి దాన్ని శుభ్రపరిచాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో, బ్రూనో చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలను అపరిశుభ్రం చేస్తున్న కొందరు పర్యాటకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన పర్యాటక ప్రదేశాల పరిరక్షణపై బాధ్యతను గుర్తుచేస్తోంది.

సంబంధిత పోస్ట్