రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి (వీడియో)

10723చూసినవారు
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజధాని జకార్తా సమీపంలోని బెకాసి తిమూర్ స్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ‘ఆర్గో బ్రోమో అంగ్రెక్’ ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, సుమారు 38 మంది గాయపడ్డారు. మహిళల కోసం కేటాయించిన బోగీ తీవ్రంగా దెబ్బతింది. సహాయక సిబ్బంది శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్