రైతును నమ్మించి రూ. 75 వేలు దోచుకున్న దుండగులు

14చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పట్టపగలే ఓ రైతును మోసం చేసి రూ. 75,000 నగదును దొంగిలించారు. శ్యామ్ రావు అనే రైతు బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని ఇంటికి వస్తుండగా, నలుగురు దుండగులు అతడిని అనుసరించారు. 'నీ బైక్ నుండి డబ్బులు కింద పడ్డాయి' అని నమ్మించి, రైతు దృష్టి మళ్లించి బైక్ కవర్‌లో ఉన్న నగదును కాజేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్