నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అమ్మిరెడ్డిపల్లిలో ఐదేళ్ల తేజశ్రీ అనే బాలిక హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు బాలికను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి సమీపంలోని చెరువు కట్టపై పడేశారు. బాలిక ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను కూడా అపహరించినట్లు సమాచారం. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.