డేటా సెంటర్లకు భవిష్యత్తులో అతిపెద్ద ముప్పు

65చూసినవారు
డేటా సెంటర్లకు భవిష్యత్తులో అతిపెద్ద ముప్పు
భవిష్యత్తులో ఫోన్లు, వాచ్‌లు వంటి డివైజ్‌లు ఇన్‌బిల్ట్‌ ఏఐతోనే వస్తాయని, దీనివల్ల కేంద్రీకృత డేటా సెంటర్లకు ముప్పు పొంచి ఉందని ఏఐ కంపెనీ పర్‌ప్లెక్సిటీ సీఈవో అరవింద్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. డివైజ్‌ల్లోనే ఏఐ చిప్‌లను అమర్చితే, బయట ఉన్న డేటా సెంటర్ల నుంచి ఏఐని వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం డేటా సెంటర్ల భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్