అష్టాదశ శక్తి పీఠాలు ఇలానే ఉద్భవించాయా!

11346చూసినవారు
అష్టాదశ శక్తి పీఠాలు ఇలానే ఉద్భవించాయా!
దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నిలో దూకిన తర్వాత, పరమశివుడు ఆమె శరీరాన్ని చేతుల్లో పట్టుకొని విలపిస్తూ భారత ఖండమంతా తిరిగినప్పుడు, ఆమె శరీర భాగాలు ఒక్కోచోట పడి అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయని పండితులు అంటున్నారు. మొత్తం 108 శక్తి పీఠాలు ఉండగా, వాటిలో ముఖ్యమైనవి 18 ఉన్నాయి. వీటిలో 4 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏపీలో శ్రీశైలంలో భ్రమరాంబిక ఆలయం, కాకినాడలోని పిఠాపురంలో పురుహూతిక దేవి ఆలయం, కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మాణిక్యాంబ దేవి ఆలయం, తెలంగాణాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ జోగులాంబ ఆలయమని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్