పెళ్లి వీడియోలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వధువు మండపంలో నిద్రపోయింది. తాలికట్టే సమయం వచ్చేసరికి వరుడు ప్రేమగా ఆమెను మేల్కొలపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్క క్షణంలో వధువు మేల్కొని ఆశ్చర్యపోతుంది. Instagramలో @success_life_partner ద్వారా షేర్ అయిన ఈ వీడియోకి 4.21 లక్షల వ్యూస్ వచ్చింది. నెటిజన్లు వరుడి హావభావాలను మెచ్చుకుంటూ.. సంతోషంతో కామెంట్లు చేస్తున్నారు.