బీఆర్ఎస్ కథ ముగిసింది, మళ్లీ మొలవనివ్వం: సీఎం రేవంత్ రెడ్డి

1చూసినవారు
గత పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ నేతలను ప్రజలు కోరుకోవడం లేదని, కేవలం వారి కుటుంబం, దోపిడీదారులు మాత్రమే అధికారాన్ని ఆశిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేసిందని, వారికి భవిష్యత్తు లేదని, నల్గొండ జిల్లాలో మళ్లీ ఆ పార్టీ మొక్క కూడా మొలవనివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.13 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్