AP:
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీపట్నం కూలింగ్ కెనాల్లో ఈ నెల 18న యువతి శరీర భాగాలు కొట్టుకొచ్చిన ఘటనలో, మంగళగిరికి చెందిన కళ్యాణిగా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి ఆమె తమ్ముడు నాగారాజుని విచారించగా, కళ్యాణి బిర్యానీ సెంటర్లో వెయిటర్‌గా పనిచేసేదని, భర్త నుంచి విడిపోయి విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తియే ఆమెను హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.