మేడారం అభివృద్ధికి కేంద్రం సాయం చేయలేదు: పొంగులేటి

38చూసినవారు
మేడారం అభివృద్ధికి కేంద్రం సాయం చేయలేదు: పొంగులేటి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారం అభివృద్ధికి కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మేడారం అభివృద్ధికి రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు ప్రకటించడం అవాస్తవమని, ఆయన మాటలు చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మేడారాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.