
తొక్కిసలాటలో భర్త మృతి.. తల్లడిల్లిన నిండు గర్భిణి (వీడియో)
తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ తొక్కిసలాటలో అమరై కన్నన్(26) అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా అతడి భార్య 9 నెలల గర్భిణి. అయితే తన భర్తను కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించనిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 'ఏవండీ లేవండీ' అంటూ ఆ నిండు గర్భిణి కట్టుకున్న వాడికోసం రోదిస్తుంటే అక్కడి వాళ్ల గుండెలు పగిలిపోయాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.




