నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకతంలో 'అఖండ-2' చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్సు సంస్థ సానుకూల చర్చలు జరిపినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మంగళవారం మద్రాస్ కోర్టులో ఉదయం 10.30 గంటలకు కోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో విడుదలకు అనుమతులు పొందే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో, 12న సినిమా విడుదల, 11న ప్రీమియర్లు ప్రదర్శించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.