దేశంలోనే తొలి AI ఆక్వాకల్చర్ పార్క్.. వేలాది మందికి ఉపాధి

12436చూసినవారు
దేశంలోనే తొలి AI ఆక్వాకల్చర్ పార్క్.. వేలాది మందికి ఉపాధి
దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆక్వాకల్చర్ పార్క్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు కానుంది. సీఐఐ సదస్సులో ఏపీ ప్రభుత్వం, కింగ్స్ ఇన్‌ఫ్రా వెంచర్స్ మధ్య రూ.2,500 కోట్లతో 500 ఎకరాల్లో ఈ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దీనితో శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా 1,500, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ పార్కులో హేచరీలు, ఇండోర్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ఉంటాయి. విశాఖపట్నం నుంచి AI ద్వారా నియంత్రణ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్