బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టివాగులపల్లిలో పర్యటించి, భూ బాధితులతో సమావేశమైంది. ఈ సందర్భంగా బాధితులు మంత్రి పొంగులేటి కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'మంత్రి పొంగులేటి కుమారుడే కబ్జాలకు పాల్పడ్డాడు. బాధితులను బెదిరించి 27 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. 1960 నుంచి సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి విలువ సుమారు 1400 కోట్లు. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షారెడ్డి స్వయంగా వెళ్లి బెదిరించారు' అని ఆరోపించారు. సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి లేదా అమ్మడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది.