పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత వంటగదులపై పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నపాటి తినుబండారాల కేంద్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ దొరకకపోవడంతో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో వ్యాపారులు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల పాత పంప్ స్టవ్‌లను కూడా వాడుతున్నారు. కట్టెలకు డిమాండ్ పెరగడంతో వాటి ధరలు కూడా భారీగా పెరిగాయి. గ్యాస్ పొయ్యి రోజులు పోయి కట్టేల పొయ్యి రోజులు వచ్చాయని పెద్దలంటున్నారు.