రాజోలు మండలం చింతలపల్లికి చెందిన ప్రముఖ టీవీ, రంగస్థల నటుడు యేడిద కృష్ణారావు మాస్టారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. కృష్ణారావుకు కుమారులు లేకపోవడంతో, ఆయన కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించి తండ్రికి కొరివి పెట్టారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.