పత్తి కొనుగోళ్లపై తొలగిన ప్రతిష్టంభన.. ఫలించిన మంత్రి తుమ్మల చర్చలు

27చూసినవారు
పత్తి కొనుగోళ్లపై తొలగిన ప్రతిష్టంభన.. ఫలించిన మంత్రి తుమ్మల చర్చలు
TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంపై కేంద్ర మంత్రులతో పాటు సీసీఐ సీఎండీతో మాట్లాడి నిబంధనల్లో మార్పులు చేసేందుకు అంగీకరించేలా ఒప్పించారు. దీంతో రాష్ట్రంలో నోటిఫై చేసిన మొత్తం 330 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా ఇకపై సీసీఐ, జిన్నింగ్ మిల్లులు పనిచేస్తాయని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్