
విమాన ఇంధనం తగ్గింపు.. వాణిజ్య సిలిండర్ ధర పెంపు
గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా భారత చమురు కంపెనీలు విమానాల్లో వాడే ఇంధనం (ATF) ధరను భారీగా తగ్గించాయి. ఢిల్లీలో జెట్ల ఇంధనం కిలో లీటర్కు రూ.7,353 (7.3 శాతం) తగ్గింది. అదే సమయంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.111 పెరిగింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,691కి చేరింది.




