సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మార్చుకోలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. థియేటర్ల కంటే సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే ధరల పెంపు జీవో ఇచ్చారని, శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిదని ఎద్దేవా చేశారు. నచ్చిన వారి సినిమాల టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించారు.