ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఆ వ్యాధే: WHO

42చూసినవారు
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఆ వ్యాధే: WHO
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ఇస్కీమిక్‌ హార్ట్‌ డిసీజ్‌ (IHD) ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదికలో వెల్లడించింది. గుండెకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే ఈ వ్యాధితో ప్రపంచ మరణాల్లో 16 శాతం సంభవిస్తున్నాయి. 2000లో IHD కారణంగా 30 లక్షల మంది మరణించగా.. 2023 నాటికి ఆ సంఖ్య 95 లక్షలకు చేరింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు ఆయుర్దాయం కొవిడ్‌ ముందు స్థాయికి చేరుకుంది. 2019లో 73.4 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2021లో 71.5 ఏళ్లకు పడిపోగా.. 2023లో 73.3 ఏళ్లకు చేరింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 6.1 కోట్ల మంది మరణించగా.. 3.3 కోట్ల మంది 10 ప్రధాన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్