సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆయుధాలు కూడా మారుతున్నాయి. బ్రిటీష్ నేవీ 2027 నాటికి తమ నౌకలలో డ్రాగన్‌ఫైర్ లేజర్ గన్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ ఆయుధం శబ్దం లేకుండానే, కాంతి వేగంతో దూసుకుపోయే డ్రోన్లు, బాంబులు వంటి లక్ష్యాలను క్షణాల్లో ధ్వంసం చేయగలదు. సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న వస్తువులను కూడా ఖచ్చితంగా గురి పెట్టగల సామర్థ్యం దీనికి ఉంది. విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ లేజర్ గన్, బుల్లెట్లు లేదా పేలుళ్లు లేకుండానే లక్ష్యాలను వేడి చేసి కరిగించివేస్తుంది.