ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా ఇవాళ జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఐదు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్, శివమ్ దూబే స్థానంలో నితీశ్ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది.