వరద కాల్వ జీవనదిలా మారింది: ఆది శ్రీనివాస్ (వీడియో)

7చూసినవారు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వరద కాల్వ జీవనదిలా మారిందని, తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి చేస్తున్న వాదనలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే జీవన్ రెడ్డి ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనులు చేస్తుంటే, ఓర్వలేకనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అజెండాను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయి ఎవరికీ ఉపయోగపడకుండా పోయిందని ఆది శ్రీనివాస్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్