ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న గౌరీ గుండాల జ‌ల‌పాతం (వీడియో)

70చూసినవారు
తెలంగాణ‌లోని పెద్దపల్లి జిల్లా సబితం గ్రామంలోని గౌరీ గుండాల జ‌ల‌పాతం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వ‌ర్షాలు కార‌ణంగా జ‌ల‌పాతానికి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ద‌ట్ట‌మైన ప‌చ్చ‌ని కొండ‌ల మ‌ధ్య ప్ర‌వ‌హిస్తూ.. చాలా ఎత్తు నుంచి కిందికి దుముకుతున్న నీటి ప్ర‌వాహం సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తోంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు స‌మీప జిల్లాల నుంచి జ‌ల‌పాతం అందాల‌ను వీక్షించేందుకు సంద‌ర్శ‌కులు వెళ్తున్నారు. జ‌ల‌పాతం స‌బితం గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

సంబంధిత పోస్ట్