ప్రేమించిన మైనర్ బాలుడిని విషమిచ్చి చంపిన బాలిక తండ్రి

4చూసినవారు
ప్రేమించిన మైనర్ బాలుడిని విషమిచ్చి చంపిన బాలిక తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించుకున్న 15 ఏళ్ల మైనర్ బాలుడిని, బాలిక తండ్రి కిరాయి గుండాలతో కలిసి మంగళవారం రాత్రి అతి కిరాతకంగా కొట్టించి, బలవంతంగా విషమిచ్చి చంపేశాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బుధవారం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని, బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్