నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్" - అల్లు అరవింద్

27చూసినవారు
నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్" - అల్లు అరవింద్
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా, అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో, 14న ఇతర భాషల్లో విడుదల కానుంది.

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతా . గీతా ఆర్ట్స్‌లో వర్క్ చేయడం అదృష్టమని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఇద్దరూ ఈ సినిమాను విజువల్ ఫీస్ట్‌గా అభివర్ణించారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ. రాహుల్ సినిమా పట్ల కమిటెడ్ డైరెక్టర్” అని, దీక్షిత్ తెలుగులో పెద్ద హీరో అవుతాడని చెప్పారు. నిర్మాత విద్య కొప్పినీడి “ప్రతి తల్లిదండ్రి పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది” అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ . రశ్మిక ఈ దశాబ్దంలో బెస్ట్ ఫీమేల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, దీక్షిత్ తదుపరి పెద్ద హీరో అవుతాడు అన్నారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.ఈ సినిమా నాకు నమ్మకం ఇచ్చింది, రశ్మిక గొప్ప కోస్టార్” అన్నారు.

అల్లుఅరవింద్ గారు మాట్లాడుతూ . ఈ సినిమా ద్వారా డబ్బుకన్నా సంతృప్తి సంపాదించాను. ప్రతి కుటుంబం దీనిలో తమ కథను చూసుకుంటుంది” అన్నారు.

కాస్ట్: రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, రావు రమేష్
టెక్నికల్ టీమ్: సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్, సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహాబ్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
దర్శకుడు: రాహుల్ రవీంద్రన్

సంబంధిత పోస్ట్