
ముగిసిన ఐపీఎల్ మినీ వేలం.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్
ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీలు మొత్తం రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతడిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది.




