TG: రాష్ట్రంలో దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. మంగళవారం SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై కమిటీ భేటీలో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులేనని, ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.