కార్మికులను ప్రభుత్వం మోసం చేసింది: హరీష్ రావు

16చూసినవారు
కార్మికులను ప్రభుత్వం మోసం చేసింది: హరీష్ రావు
TG: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, కార్మికులను మోసం చేస్తోందని, ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టడం దారుణమని ఆరోపించారు. పటాన్‌చెరు సిగాచి పరిశ్రమలో మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం విషయంలోనూ ప్రభుత్వం అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, సింగరేణి కార్మికులను వంచించిందని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ ప్రకటన లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్