సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండే స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా మరోసారి పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా త్రిష పెళ్లి ఫిక్స్ అయిపోయిందట అనే రూమర్లు టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, త్రిష మాత్రం ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ, 'నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్నవారిని నేను ప్రేమిస్తా.. హనిమూన్ షెడ్యూల్ కూడా చెబుతారని వెయిటింగ్' అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. దీంతో మరోసారి ఆమె పెళ్లి వార్తలను ఖండించినట్లైంది.