భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే!

20117చూసినవారు
భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షాపూర్ ప్రాంతంలో బుధవారం ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వకర్మ చౌహాన్, మమతా చౌహాన్(35)లు భార్యాభర్తలు. మమతా తన భర్త నుండి విడిగా ఉంటూ.. 13 ఏళ్ల కుమార్తెతో నివసిస్తోంది. అయితే భర్తకు విడాకులు ఇవ్వాలంటే తన కుమార్తె పోషణ కోసం వ్యవసాయ భూమిని బదిలీ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ కారణంగానే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.