
ఇంట్లో మంటలు చెలరేగి.. ఆరుగురు సజీవ దహనం (వీడియో)
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లా తలంగ్నా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లోని వంట గది నుంచి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇంటి యజమాని కుమార్తె, అల్లుడు కూడా ఉన్నారు. వీరు పండుగ వేడుకల కోసం ఇక్కడికి వచ్చారు. మారుమూల గ్రామం కావడంతో సహాయక చర్యలు అందేలోపే భారీ నష్టం వాటిల్లింది.




