AP: గుంటూరులో ట్రాన్స్‌జెెండర్లు ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు నీళ్ల మోటారు బిగించుకున్నందుకు మల్లెల మూర్తి రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె డబ్బు ఇవ్వలేదు. దాంతో అధికారులతో మోటారును తొలగించాడు. అది వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మల్లెల మూర్తి ట్రాన్స్‌జెండర్లను పిలిపించి దాడి చేయించారు. ఈ ఘటనలో నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.