‘ది కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌లో మార్పు

50చూసినవారు
‘ది కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌లో మార్పు
‘ది కేరళ స్టోరీ 2’ ఓటీటీ విడుదల తేదీలో మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని ముందుగా మే 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్రకటించిన జీ5, తాజాగా తేదీని ముందుకు జరిపింది. ఇప్పుడు మే 1 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగు ఆడియోలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదల సమయంలోనే వివాదాల మధ్య చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఓటీటీలో ముందుగానే విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్