ప్రాణం మీదకు తెచ్చిన ‘గాలిపటం’

5చూసినవారు
ప్రాణం మీదకు తెచ్చిన ‘గాలిపటం’
విశాఖ జిల్లా గాజువాకలో ఆకాశ్‌ కుమార్ (9) అనే బాలుడు గాలిపటం ఎగరేస్తున్న క్రమంలో.. గాలిపటం హైటెన్షన్‌ విద్యుత్తు తీగల్లో చిక్కుకుంది. దాన్ని లాగే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలో సమీపంలోని ఇళ్లలో విద్యుత్తు పరికరాలు కాలిపోయాయి. బాలుడిని మొదట ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై కేజీహెచ్‌కు తరలించగా, ప్రస్తుతం బర్న్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్