యువకుడి ప్రాణం తీసిన గాలిపటం

56చూసినవారు
యువకుడి ప్రాణం తీసిన గాలిపటం
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన నరేందర్‌ అనే యువకుడు గాలిపటం ఎగురవేయడానికి బిల్డింగ్‌ పైకి ఎక్కాడు. గాలిపటం ఎగురవేసే క్రమంలో అదుపుతప్పి పై నుంచి కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ నరేందర్‌ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్