టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'ది రాజా సాబ్' సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సెలవులు, ప్రభాస్ క్రేజ్‌తో కలెక్షన్లు భారీగానే నమోదవుతున్నాయి. తొలి రోజే రూ.120 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ‘R’ లెటర్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో R లెటర్ పైన రాఘవేంద్ర, రెబల్, రాధే శ్యామ్ సినిమాలు వచ్చినా అవి అంతగా ఆడలేదని, డార్లింగ్‌కి ‘R’ లెటర్ అచ్చురాలేదని నెట్టింట చర్చ జరుగుతోంది.