చనిపోయాడన్నారు.. అంబులెన్స్‌లో తరలిస్తుండగా లేచి కూర్చున్నాడు!

19672చూసినవారు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చీకటి శంకరయ్య (66)ను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, ఈ నెల 25న ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో శంకరయ్య లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తిరిగి వేములవాడలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్