‘ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ నీకు తోడుగా ఉంటాను’ అని వేద మంత్రాల సాక్షిగా ఇచ్చే పెళ్లి ప్రతిజ్ఞలు ఇప్పుడు చాలా చోట్ల మాటలకే పరిమితమవుతున్నాయి. పెళ్లయి కొద్ది రోజులు గడవక ముందే భర్త, భార్య మధ్య చిన్నచిన్న విభేదాలు పెద్ద గొడవలుగా మారి విడాకుల దిశగా సాగిపోతున్నాయి. సర్దుబాటు అనే మాటే లేకుండా, స్వీయ గర్వం, కోపం కారణంగా బంధం తేలిపోతుంది. మొదట్లో వచ్చే చిన్న వివాదాలు సకాలంలో పరిష్కరించుకోకపోతే జీవితాంతం మానసిక దూరాన్ని తెస్తాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.