మరికాసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్

70చూసినవారు
మరికాసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లలోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే ఐసీసీ నాకౌట్ దశ మ్యాచ్‌లలో మాత్రం న్యూజిలాండ్ జట్టుదే పై చేయిగా ఉంది . ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికా జట్టు తమ నాకౌట్ ఫోబియాను దాటి ఫైనల్‌కు చేరుకుంటుందా లేక న్యూజిలాండ్ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్