మంత్రి పదవి సీఎం చేతిలో కాదు.. అధిష్టానం చేతిలో ఉంటుంది: రాజగోపాల్‌

54చూసినవారు
మంత్రి పదవి సీఎం చేతిలో కాదు.. అధిష్టానం చేతిలో ఉంటుంది: రాజగోపాల్‌
TG: మునుగోడు ప్రాంతం అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'డిండి ప్రాజెక్టు నుంచి నీరు ఇచ్చేలా చూడాలని సీఎం రేవంత్‌ను కోరా. అదే విషయమై నకిరేకల్ సభలో సీఎం రేవంత్‌తో మాట్లాడా. ఈ అంశాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. మంత్రి పదవి కోసమే సీఎం రేవంత్‌ను కలిశానని బద్నాం చేస్తున్నారు. మంత్రి పదవి అనేది సీఎం రేవంత్‌ చేతిలో కాదని, అధిష్టానం చేతిలో ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్