
ఏపీలో భూకంపం
ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలో తెల్లవారుజామున 3:12 గంటలకు 3.4 మాగ్నిట్యూడ్ తో స్వల్ప భూకంపం సంభవించింది. మార్కాపురం, దర్శి ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది. అదృష్టవశాత్తు, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.




