
ఎనిమిదో తరగతిలో మందలించిన టీచర్.. ఆరేళ్లుగా వెంటాడుతున్న విద్యార్థి
AP: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జుమ్మువలసలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం ఎనిమిదో తరగతిలో మందలించిన గురువుపై విద్యార్థి కక్ష పెంచుకొని తరచూ దాడి యత్నాలు చేస్తున్నాడు. 2019లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన సువ్వాడ వెంకట అప్పలనాయుడు అల్లరి చేస్తున్న విద్యార్థి దిలీప్‌ను మందలించగా, అతడు అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. గతేడాది కత్తితో దాడి చేసిన దిలీప్ తాజాగా మళ్లీ దాడికి దిగాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




