ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవాలలో తేలు విషం ఒకటి. ముఖ్యంగా 'డెత్ స్టాకర్' తేలు విషం లీటరు ధర రూ.80 కోట్లు దాటుతుంది. ఈ తేలు విషంలో ఉన్న పెప్టైడ్స్, ప్రోటీన్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాలు, నరాలు, కండరాలపై ప్రభావం చూపే శక్తి కలిగి ఉంటాయి. క్లోరో టాక్సిన్ అనే భాగం మెదడు కణుతులను గుర్తించి నాశనం చేయడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్, మలేరియా వంటి రోగాలపై ఔషధ పరిశోధనల్లో విస్తృతంగా ఉపయోగపడుతుంది.