
పుష్ప 3 కంటే ముందే సుకుమార్-రామ్ చరణ్ మూవీ (వీడియో)
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ వెల్లడైంది. పుష్ప 3 కంటే ముందే వీరి కాంబినేషన్లో సినిమా రానుందని మైత్రీ నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని ఆ తర్వాత రామ్ చరణ్ డేట్స్ చూసుకుని ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని శనివారం మైత్రీ నవీన్ 'డ్యూడ్' సక్సెస్ మీట్లో వెల్లడించారు.




