TG: ఒక్క 'బాబు' అనే మాట నల్గొండ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీని ఛేదించింది. చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఇంట్లోకి వచ్చిన విద్యార్థిని చూసి రూపారెడ్డి 'బాబు' అని పిలవడమే పోలీసులకు కీలకంగా మారింది. ఈ పదం ఆధారంగా, గత రెండ్రోజులుగా గైర్హాజరైన ఇద్దరు విద్యార్థులను, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్‌లో చూసి హత్య చేసే పద్ధతులు నేర్చుకున్నట్లు నిందితులు అంగీకరించారు.