
ఒకటో తరగతి పిల్లాడిని ఎండలో నిలబెట్టిన స్కూల్ యాజమాన్యం
బెంగళూరులోని యలహంకలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థిని రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో సుమారు రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టి శిక్షించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు పాఠశాల యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించడం శిక్షార్హమని పోలీసులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.




