తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదిలాబాద్ జిల్లాలో మేధావులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, జిల్లా ప్రజల ఇబ్బందులపై చర్చించారు. మార్చి-ఏప్రిల్‌లో కొత్త పార్టీ ప్రకటనపై వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ప్రజాబాట కార్యక్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ముగుస్తుందని, నాలుగు నెలల పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటున్నామని తెలిపారు. జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని, పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆమె అన్నారు.