గుజరాత్‌లోని సూరత్‌లో తాపి నది ఒడ్డున ఉన్న రుంధనాథ్ మహాదేవ్ ఆలయం ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు సజీవ పీతలను శివలింగానికి సమర్పిస్తారు. పూజ అనంతరం పీతలను తాపి నదిలోకి వదులుతారు. స్థానిక పురాణకథనం ప్రకారం వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని, ఆ సమయంలో ఓ పీత ప్రతిరోజూ ఆయన పాదాల వద్దకు వచ్చేదని కథనం. ఆ పీత భక్తికి మెచ్చిన శ్రీరాముడు భవిష్యత్తులో భక్తులు పీతలను సమర్పించేలా వరమిచ్చాడని స్థానిక విశ్వాసం.