
పీడీ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. పీడీ అరెస్ట్
TG: ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) షఫిక్ అహ్మద్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అతడిని అధికారులు విధుల నుంచి తొలగించారు. శుక్రవారం విద్యార్థినులు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖాధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు నిజమని తేలడంతో శనివారం పీడీని సస్పెండ్ చేసి, పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.




